Nursery Plants | జహీరాబాద్ , సెప్టెంబర్ 10 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ పాలనలో నర్సరీల ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో తాజా ఘటన చెప్పేస్తుంది.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. హరితహారం లక్ష్యంలో భాగంగా వేలాది మొక్కలను నల్ల పాలిథిన్ కవర్లలో నాటి పెంచుతున్నారు. అయితే సరైన సంరక్షణ లేకపోవడంతో ఆ మొక్కలు వాడిపోతున్నాయి. నర్సరీ అంతా కలుపు మొక్కలతో నిండిపోయింది. చాలా కవర్లలో మొక్కలు ఎండిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నీరు లేక నేల బీటలు వారింది.
మొక్కల మధ్య ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త పేరుకుపోయి ఉంది. లక్షల రూపాయల ప్రజాధనంతో పెంచుతున్న ఈ నర్సరీని పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిత్యం నీరు పోయకపోవడం, కలుపు తీయకపోవడంతో మొక్కలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా, మండల ఉన్నతాధికారులు స్పందించి మీర్జాపూర్ నర్సరీని సందర్శించి, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకొని మొక్కలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ