సోషల్ మీడియాలో మార్ఫింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. నకిలీ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్‌లను అశ్లీల కంటెంట్‌కు జోడించి గబ్బు లేపుతున్నది. బీఆర్ఎస్ లక్ష్యంగా అధికార పార్టీ సాగిస్తున్న విష ప్రచారానికి రూ.113 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్టు అంచనా.
సోషల్ మీడియాలోకి వరద ప్రవాహంలా వచ్చి చేరుతున్న మార్ఫింగ్ ఫొటోలు, డీఫ్ ఫేక్ వీడియోలు, ఇమిటేటింగ్ వాయిస్‌లు, అశ్లీల కంటెంట్‌కు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. తాజాగా దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ వీడియో సాంగ్‌ను కొందరు రోతగాళ్లు డీప్ ఫేక్ ఏఐని ఉపయోగించిన సినీనటి జాన్వీ కపూర్ మార్ఫింగ్ వీడియోను వైరల్ చేయడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, ప్రజలు, అభిమానుల నుంచి విమర్శలు రావడంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్ర పరిశ్రమపైనే గాక రాజకీయాల్లోనూ ఈ విశృంఖల ధోరణి పెచ్చుమీరుతున్నది. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కేసీఆర్ కుటుంబంపై కూడా కొన్నాళ్లుగా ఏఐతో దాడి చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, వాయిస్‌లు విడుదల చేస్తూ విష ప్రచారానికి తెగబడుతున్నారు. వీటిపై సైబర్‌క్రైమ్‌లో ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకున్నది లేదు. ఇంతలా డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ ఫొటోలు, మార్ఫింగ్ వాయిస్‌లు చేయడానికి కాంగ్రెస్ ఎంత ఖర్చు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.113 కోట్లకు పైనే.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీపైన.. ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై సోషల్ మీడియాలో విపరీతమైన విష ప్రచారం జరుగుతున్నది. ఎక్కడచూసినా ఏఐ ఫొటోలు, డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వాయిస్‌లు.. రోత ప్ర చారాలే కనిపిస్తుండటం వారి కుటుంబసభ్యు లు, అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్న ది. పరిపాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు వి ఫలమై.. సమస్యలు, హామీలపై నిలదీస్తున్న ప్ర తిపక్ష నేతలపై కక్షగట్టారు. కేసీఆర్ కుటుంబంపై ఏఐతో విష ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ము ఖ్యనేత, కీలక నేత విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. ఇందుకోసం రూ.113 కోట్లు కేటాయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రజల సొమ్మును దారి మళ్లించిన ము ఖ్యనేత, కీలక నేతలు కలిసి.. ఈ దుష్ప్రచారానికి తెగబడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్‌లో ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు ప్రజాధనం కుమ్మరిస్తూ, అడ్డగోలు ప్రచారం చేయిస్తున్నారు.
రాజకీయ ప్రచారం సోషల్ మీడియా వేదికెక్కిన తర్వాత.. కాంగ్రెస్ నీచ రాజకీయానికి తెరలేపింది. బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు, వారి కుటుంబసభ్యుల డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నది. ఇటీవల కేటీఆర్, హరీశ్‌రావు టార్గెట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్’, ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాలను డీప్ ఫేక్ వీడియోలుగా క్రియేట్ చేస్తున్నారు.
వాయిస్ క్లోనింగ్ చేసి అడ్డగోలుగా కాంగ్రెస్ సో షల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పెయిడ్ ఖాతాలకు స్టఫ్‌గా ఇస్తున్నారు. ఈ విష ప్రచా రానికి సూత్రధారి, పర్యవేక్షణ అంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో బడా కాంట్రాక్టర్‌గా, కీలక మంత్రిగా ఉన్న వ్యక్తి అని తెలిసింది. వీటి కోసం ఆయనకు చెందిన రెండు ఆఫీ సులను కూడా కేటాయించినట్టు సమాచారం. ఆ మంత్రి చేపట్టే కార్యక్రమాలపై ఏఐ వీడియోలు, ఫొటోలు, ప్రచారం ఆ పేజీల్లోనే ఎక్కువ గా వస్తుండటం ఇందుకు బ లాన్ని చేకూర్చుతున్నది.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శ లూ సహజమే అయినప్పటికీ, టెక్నాలజీని అ డ్డుపెట్టుకొని వ్యక్తిగత హననానికి పాల్పడటం, ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శ నం. కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేసేందు కు పెయిడ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కోట్ల రూపాయలు ధారపోస్తూ నిర్లజ్జగా పెయి డ్ ప్రచారం చేస్తున్నారు. ఇలా పెయిడ్ ప్రచా రం చేసే అన్ని ప్రొఫైళ్లకు ముఖం చూపించే దమ్ములేక ‘ప్రైవసీ లాక్’లు పెట్టుకొని నకిలీ ఖాతాలతో విర్రవీగిపోతున్నారు. ఈ దుష్ప్రచారానికి దీటుగా తెలంగాణ సమాజం, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా సమాధానం ఇస్తున్నారు. నకిలీ ప్రొఫైళ్ల నుంచి, పెయిడ్ ఆర్టిస్టుల నుంచి వచ్చే పోస్టుల కింద దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న పెయిడ్ బ్యాచ్‌కు, వారు పెట్టే పోస్టులకు వస్తున్న రీచ్, వ్యూస్, కామెంట్లు, షేర్లను, ఫాలోవర్స్‌ను బట్టి చెల్లింపులుంటాయని తెలిసింది. అలా అక్ర మంగా సంపాదించిన సొమ్ముతో కొందరు లగ్జ రీ కార్లు, భూములు, ఫ్లాట్లు కొంటున్నారట. గతంలో ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటే కూలికి పోయిన కొన్ని కిరాయి గొంతు లు.. ఇప్పుడు కాంగ్రెస్ విసిరిన ఆ డబ్బులతో కార్లు కొనుగోలు చేశాయి.
మొన్నటివరకూ చె ప్పులు కూడా సరిగా లేని కొందరు.. ఇప్పుడు ఖద్దర్ చొక్కాలు తొడిగి వీడియోలు చేస్తూ.. కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని పోల్చుతూ వీడియోలు చేసే పెయిడ్ ఆర్టిస్టులను రహస్యంగా ఓ చోట ఉంచి వారితో వీడియోలు చేయిస్తున్నారు. వారు బయట కనిపిస్తే.. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేస్తారనే భయంతో వారిని దాచిపెడుతున్నారని తెలిసింది. వారు కొన్నేండ్లుగా పెయిడ్ వీడియోలు చేస్తున్నా.. పోలీసులు స్పందించడం లేదు.
విషప్రచారంపై డీజీపీ కార్యాలయంలో, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా నేటికీ చర్యలు లేవు. సెప్టెంబర్ 9న బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లా అండ్ ఆర్డర్ డీజీపీని కలిసి మార్ఫింగ్, ఫేక్, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ చేసేవారిపై చ ర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పెయిడ్ ప్ర చారం వల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకొనైనా ఆ నిర్దిష్ట ఖాతాలు, వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు, వారికి వచ్చే ఆదేశాలు.. రాజకీయ నేతల సంబంధాలను దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉన్నది.
అయితే, ఎవరైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు.. రాత్రికి రాత్రి జైలుకు పంపుతున్నారు. మరి కాంగ్రెస్ సోషల్ మీడియాకు, పెయిడ్ ఆర్టిస్టులకు ఇది ఎందుకు వర్తించదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై కూడా ఇలానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి దేవుళ్లు, ఆడపిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు.
కఠిన చర్యలు తప్పవు
‘ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తప్పుడు ఫొటోలు, మార్ఫింగ్ వీడియోలను సర్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. మీకు ఇదే నా హెచ్చరిక. ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ ఫొటోలు, వీడియోలను నిజమైనవిగా చూపి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీఆర్ఎస్ సహించదు. కేవలం కంటెంట్ క్రియేట్ చేసినవారే కాకుండా, వాటిని ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ప్రసారం చేసే, సర్యులేట్ చేసే మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కూడా న్యాయపరమైన పోరాటం చేస్తాం.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
(9 సెప్టెంబర్, 2026)