IIIT | నిజాంపేట్, జులై 5 : బాసరలోని త్రిపుల్ ఐటీకి తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నిజాంపేట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నలుగురు, మండల పరిధిలోని బాచేపల్లి పాఠశాలలో ఐదుగురు, నాగదార్లో ఒక్కరు మొత్తం పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బాసరలోని త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
త్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు గ్రామ ప్రజలు సంతోషం వ్వక్తం చేశారు. వారంతా పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఙతలు తెలిపారు.
మండలంలో ట్రిపుల్ ఐటీకి 11 మంది విద్యార్థులు ఎంపిక
సిర్గాపూర్, జూలై 05 : మండలంలోని ఆయా పాఠశాలల్లో టెన్త్ చదివి ఉత్తీర్ణులైన 10 మంది విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారని ఎంఈవో నాగారం శ్రీనివాస్ శనివారం తెలిపారు. సిర్గాపూర్ హైస్కూల్ లో 4, వాసర్లో 2, ఎస్టీ బాలికల గురుకులంలో 2, కడ్పల్ హైస్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు ఐఐఐటీ లో సీటు వచ్చిందని చెప్పారు. వీరిని ఎంఈవో అభినందించారు. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు