MLA Chinta Prabhakar | సదాశివపేట, ఏప్రిల్ 17 : ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవాళ రజతోత్సవ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అతికించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్‌పాటిల్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్‌నాయక్, విద్యాసాగర్‌రెడ్డి, ముబీన్ మోహినోద్దిన్, నసీర్బాయ్, సత్యం, సాతాని శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, కోడూరి అంజన్న, చౌదరి ప్రకాశ్, రాజు, విజయ్‌కుమార్, బరాడిసాయి, బోడపల్లి అవినాష్, దిడిగె నగేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్చందంగా సభకు వచ్చేలా ఏర్పాట్లు..
కంది, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఇవాళ సంగారెడ్డిలో ఛలో వరంగల్ వాల్ పెయింటింగ్స్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామ గ్రామాన సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లు అతికించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, కొండల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత