Theft | ఝరాసంగం, ఏప్రిల్2 : ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో గురువారం భారీ చోరీ జరిగింది. ఎల్గోయి గ్రామానికి చెందిన కొత్తూరు సంగణ్ణ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఏడుపాయల జాతరకు వెళ్లారు. గురువారం వారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.2 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. అదేవిధంగా గ్రామంలోని చాకలి రాజమ్మ ఇంట్లో కూడా దుండగులు చొరబడి రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ పటేల్ క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు.

Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత