Double Bed Rooms | జహీరాబాద్, జూలై 1 : రెండేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అధికారులు వాటిని అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లారు. సంబంధిత అధికారులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఇండ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఈ విషయంలో కొంతసేపు సంబంధిత అధికారులతో లబ్ధిదారులు వాగ్వివాదానికి దిగారు. తమకు ఇల్లు అప్పగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.
ఈ నెల 7వ తేదీలోగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగిస్తామని సంబంధిత రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు. ఏడో తేదీలోగా ఇళ్లను అప్పగించకుంటే తామే ఇండ్లలోకి వెళ్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు మహిపాల్, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!