ఉపాధ్యాయుల పోరుబాట
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.
- విద్యారంగ సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించం
- పీఆర్సీ ప్రకటించే వరకు నల్లబ్యాడ్జీలతోనే విధులు
- 29న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు
- దశలవారీగా పోరాటాలకు సిద్ధమవుతున్న టీచర్లు
ఉట్నూర్, ఆగస్టు 9 : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు దశల కార్యాచరణను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ప్రకటించింది.
కార్యాచరణ..
- ఇప్పటికే పాఠశాలల స్థా యిలో నల్లబ్యాడ్జీలతో వి ధులకు హాజరై భోజన వి రామ సమయంలో నిరస న తెలిపారు. పీఆర్సీ ప్రక టించే వరకు నల్లబ్యా డ్జీల తో విధులకు హాజరవు తారు.
- ఈనెల 12, 13 తేదీలలో మండల కేంద్రా లలో నిరసన పదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాం డాల సమర్పణ.
- ఈనెల 19న జిల్లా కేంద్రాలలో ధర్నాలు.
- 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా.
- సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ ముట్టడింపు.
డిమాండ్లు..
- విద్యా రంగానికి 15 శాతం నిధుల హామీని అమలు చేయాలి.
- నాణ్యమైన విద్య పేరిట పాఠశాలలను కుదించడం సరికాదు.
- పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికి యూకేజీకే పరిమితం చేశారన్నారు.
- ప్రీ ప్రైమరీ తరగతులు మధ్యాహ్నం 12 గంటల వరకే నడపాలి.
- 2018 జీవోకు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి, పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలి.
- ఈనెల 15లోగా బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ చేపట్టాలి.
- టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలి
- స్పెషల్ టెట్‌ను సబ్జెక్ట్‌కు వారి పేపర్లతో నిర్వహించాలి
- సీపీఎస్ రద్దు చేయాలి
- మొమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి.
- విద్యాశాఖలో బీసీ, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలి.
- మోడల్ స్కూల్స్‌ను, ఎయిడెడ్ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలి.
- కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి.
- జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి.
- జీవో 190 అమలు చేయాలి.
- ఐదు వాయిదాల కరువు భత్యం(డీఏ)ను వెంటనే ప్రకటించాలి.
- పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి.
- పెండింగ్ బిల్లులు ప్రతినెల 2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలి.
- హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
చాలా మంది పదోన్నతులు పొందకుండానే పదవి విరమణ చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. పదోన్నతులు పొందకపోతే ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారివారి కాలానుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము గుర్తుచేయాల్సిన బాధ్యత ఉంది. నాణ్యమైన విద్య, బడులలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట పాఠశాలల మూసివేతను తాము ఒప్పుకోం. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి విద్య దూరం చేయొద్దనే నిబంధన పాటించాలి. తమ న్యాయమైన డిమాండ్లు ఒప్పుకోకుంటే తమ ప్రణాళిక ప్రకారం ఉద్యమాలు చేస్తాం.
– ముడుగు సామ్యూల్, డీటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి, ఉట్నూర్.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

