ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 9: పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఓ అపార్ట్మెంట్ పక్కన వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టవద్దని, దీనికి మద్దతుఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాలనీవాసులను పోలీసులు, అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు.