Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Couple died | సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 27 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
ఈ ప్రమాద మృతుల్లో రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు కూడా ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి, ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్య రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాడ మాసం తర్వాత బంధుమిత్రులను ఆహ్వానించి పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకలు జరుపుకుందని అనుకున్నారు.
కానీ ఇంతలో విధి వక్రించింది. సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పేలుడు ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
Read More >>
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. ఎందుకంటే?
ఐఎంపీఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై కొత్త ఛార్జీలు..
విద్యార్థిని ఛాతిపై కూర్చుని, గొంతు కోసేశాడు.. మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో దారుణ మర్డర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

