హైదరాబాద్ : ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల(Online Transfers)పై కొత్త ఛార్జీలు విధిస్తున్నారు. ఐఎంపీఎస్ లావాదేవీలపై ఇవాళ్టి నుంచి ఛార్జీలను మార్చేశారు. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో, దాని ఆధారంగా ఛార్జీ వసూల్ చేయనున్నారు. ఐఎంపీఎస్ లావాదేవీల్లో అమౌంట్ను బట్టి రూ.2.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు వసూల్ చేయనున్నారు.
సీఆర్ఎం లేదా క్యాష్ రిసైక్లర్ మెషీన్ల వద్ద నిర్వహించే లావాదేవీలకు కొత్త నిబంధన పెట్టారు. సీఆర్ఎంల వద్ద జరిగే లావాదేవీలకు ఇప్పుడు అదనంగా మూడు ట్రాన్జాక్షన్స్ కల్పిస్తున్నారు. ఆ తర్వాత జరిగే లావాదేవీలకు కస్టమర్లు రూ.150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెలకు క్యాష్ డిపాజిట్ లక్ష దాటితే వాళ్లకు రూ.150 వసూల్ చేయనున్నారు. థార్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్లకు పరిమితిని 25 వేలుగానే ఉంచారు.