జేఎన్టీయూహెచ్లో టెండర్ వివాదాలు
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని ఆఫిలియేషన్లు, ఎంవోయూల వరకు రోజుకో వివాదం, పూటకో పంచాయితీ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. మెస్ టెండర్లు, సెక్యూరిటీ టెండర్లు సహా ఇలా ప్రతి అంశం వివాదాస్పదమవుతున్నది.
- బ్లాక్ లిస్ట్‌లోని సంస్థకు మెస్, సెక్యూరిటీ టెండర్లు
- అది కూడా 20% అధిక కొటేషన్‌తో అప్పగింత
- వర్సిటీ ఫైనాన్స్ విభాగంలో ఫైళ్లు గల్లంతైనట్టు గుర్తింపు
- సర్కార్‌కు విద్యార్థి సంఘాల నేతల ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని ఆఫిలియేషన్లు, ఎంవోయూల వరకు రోజుకో వివాదం, పూటకో పంచాయితీ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. మెస్ టెండర్లు, సెక్యూరిటీ టెండర్లు సహా ఇలా ప్రతి అంశం వివాదాస్పదమవుతున్నది. అర్హతలున్న కంపెనీలను పక్కనపెట్టి అధికారులు తమకు పర్సంటేజీలు ఇస్తామన్న కంపెనీలకే టెండర్లు కట్టబెడుతున్నారని, కమిటీల పేరిట ఈ తంతు కొనసాగుతున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పైనాన్స్ విభాగంలో ఫైళ్ల గల్లంతు అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదాలతో జేఎన్టీయూహెచ్ ప్రతిష్ట దిగజారుతున్నదని వాపోతున్న విద్యార్థి సంఘాల నేతలు.. వర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఆరోపణలు ఇవీ..
- పాలేరు ఇంజినీరింగ్ కాలేజీ మెస్ టెండర్లను ఓ మంత్రి చెప్పిన కంపెనీకి కట్టబెట్టారని, డిస్క్వాలిఫై అయిన ఆ కంపెనీకి 20% అధిక కొటేషన్‌తో టెండర్లు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. కొందరు వర్సిటీ ఆచార్యులు తమ బినామీల పేరిట ఈ టెండర్లు దక్కించుకున్నట్టు టాక్ నడుస్తున్నది.
- జగిత్యాల, మంథని మెస్ టెండర్లు అర్హతలేని కంపెనీకి కట్టబెట్టారని, దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయని విద్యార్థులు సర్కార్‌కు ఫిర్యాదు చేయడం, దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- వర్సిటీ అలుమ్ని విభాగం నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో లక్షల రూపాయలు దారిమళ్లినట్టు విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.
- సెక్యూరిటీ, ఔట్సోర్సింగ్ టెండర్లను ఆహ్వానించి, నాలుగుసార్లు రద్దుచేశారు. అర్హతలున్న ఏజెన్సీలు ముందుకు వచ్చినప్పటికీ పర్సంటేజీలు కుదరక టెండర్లు రద్దుచేసి, మళ్లీ మళ్లీ పిలుస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
- అఫిలియేషన్‌లో లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించే అప్పిలేట్ కమిటీ పేరిట గూడుపుఠాణీ నడిచిందని, భారీగా సెటిల్మెంట్లు జరిగాయని విద్యార్థి సంఘాల నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
- జేఎన్టీయూహెచ్లో ఇటీవల కాంట్రాక్ట్ టీచర్లను నియమించారు. కానీ, ఇందుకు పాలమండలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇలా నియమించిన వారికి రూ.40-50 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. అంతే కాకుండా సాంక్షన్డ్, నాన్-సాంక్షన్డ్, బడ్జెట్, నాన్-బడ్జెట్ పోస్టులంటూ అధికారులు వివాదానికి తెరలేపారు.
- కెమిస్ట్రీ ల్యాబ్ ఉపకరణాల కొనుగోలులో నిధులు దారిమళ్లినట్టు ఆరోపణలున్నాయి. ఆ డబ్బులను వర్సిటీతో సంబంధంలేని వ్యక్తికి పంపి అధికారులు కమీషన్లు పుచ్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- పీహెచ్డీ ప్రవేశాల్లోనూ అక్రమాలు జరిగాయని, అర్హతలు లేనివారికి అడ్మిషన్లు ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. పదేండ్లపాటు ఎంటెక్ చదివి, పదే పదే ఫెయిలైన వ్యక్తికి 77 మార్కులు వేశారని, ఓ ఫ్యాకల్టీ కూతురుకు అక్రమంగా అడ్మిషన్ కట్టబెట్టారని వినికిడి.
14న పాలకమండలి సమావేశం
ఈ వివాదాల నడుమ ఈ నెల 14న జేఎన్టీయూహెచ్ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. కొత్త పాలకమండలి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ పాలకమండలిలో సభ్యురాలిగి ఉన్న విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. దీంతో ఆమె లేకుండా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ అంశాలపై జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి స్పందిస్తూ.. ఏటా పాతవారే టెండర్లు దక్కించుకుంటున్నారని, దీనిని చెక్‌పెట్టాలని భావిస్తున్నామని తెలిపారు. సరైన డాక్యుమెంట్లు సమర్పించక టెండర్లలో డిస్క్వాలిఫై అయిన కొందరు ఆ తర్వాత సరైన పత్రాలు సమర్పించారని చెప్పారు. ఫైనాన్స్ విభాగంలోఅవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని, ఇందుకోసం లీగల్ ఆఫీసర్‌గా రిజిస్ట్రార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించామని వివరించారు.
విచ్చలవిడిగా ఎంవోయూలు
గత కొంత కాలంగా జేఎన్టీయూహెచ్ అధికారులు విచ్చలవిడిగా ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారు. వాటిలో భాగంగా ఓ సంస్థ సమకూర్చే ఉపకరణాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అందుకోసం రూ.4 కోట్లు ఖర్చుచేయాల్సి వస్తున్నదట. దీంతో ఓ ప్రైవేట్ సంస్థ సమకూర్చే ఉపకరణాల కోసం రూ.4 కోట్లు వెచ్చించడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు మరో సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్న జేఎన్టీయూహెచ్ అధికారులు.. ప్రతి విద్యార్థి నుంచి రూ.1,100 వసూలు చేసి, ఆ సదరు సంస్థ జేబులు నింపబోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో ఓ జర్మన్ వర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. యూనివర్సిటీ ఫైనాన్స్ విభాగంలో అనేక ఫైళ్లు గల్లంతైనట్టు వార్తలొచ్చాయి. ఎగ్జామినేషన్స్ విభాగంలో రూ.37.62 కోట్లు ఖర్చుచేయగా.. రూ.30 కోట్ల ఖర్చుకు సంబంధించిన లెక్కలే అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఆడిట్ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూల్యాంకన పారితోషికం చెల్లింపులోను అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

