హనుమకొండ చౌరస్తా, జూలై 1: హనుమకొండ చౌరస్తా, ఏనుగులగడ్డ ప్రాంతాలలో డ్రైనేజీలను బల్ధియా కమిషనర్ చాహత్ బాచ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన, రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలిగించాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరు సహకరించాలన్నారు.
చెత్తను రోడ్లు, డ్రైనేజిల్లో పడేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే అరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఆమె వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.