NTR Vs Hrithik Roshan | ఇండియన్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్, బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సిద్ధమవుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2” ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. వార్ 2లో యాక్షన్ ఒక్కటే కాదు… ఎనర్జీ పరంగా దుమ్ములేపే డాన్స్ నెంబరు కూడా ఉండబోతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ డ్యాన్సర్లు అని పేరొందిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై స్టెప్పులేస్తే, అది రొటీన్ సాంగ్ మాదిరిగా కాకుండా డైనమిక్ మ్యూజికల్ ట్రీట్‌గా ఉంటుందని అంటున్నారు.
ఇటీవల యష్ రాజ్ స్టూడియోస్‌లో ఈ సాంగ్ కోసం ఇద్దరు హీరోలు రిహార్సల్స్ చేయగా,ఈ రోజు నుంచే షూటింగ్ ప్రారంభమైంది. ఈ డాన్స్ నంబర్‌కి టాప్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పలు రోజులు కొనసాగనుండగా, ఇందులో హైవోల్టేజ్ ఎనర్జీ, ఇంటెన్స్ స్టెప్స్ ఉండనున్నాయన్న టాక్ ఫిలింనగరంలో హీట్ పెంచుతోంది. వార్ 2ను కేవలం యాక్షన్ థ్రిల్లర్‌గా కాకుండా, అన్ని విభాగాల్లోనూ స్టాండర్డ్స్‌ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ – హృతిక్ మధ్య ఫైట్స్ అన్నీ ఏకంగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుండగా, ఇప్పుడు డ్యాన్స్ ఎలిమెంట్ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లనుంది.
ఇద్దరికి సింగిల్ టేక్ డ్యాన్సర్లు అనే పేరుంది. ఎన్టీఆర్ తన బ్లాస్టింగ్ డ్యాన్స్ మూవ్‌లతో తెలుగులో తిరుగులేని డ్యాన్సర్‌గా గుర్తింపు పొందగా, హృతిక్ రోషన్ బాలీవుడ్లో తన స్టైలిష్ స్టెప్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి స్టార్లను ఒకే పాటలో చూడడం అంటే, అభిమానులకే కాదు , ప్రేక్షకులందరికీ అది జీవితాంతం మరిచిపోలేని విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డ్యాన్స్ సీక్వెన్స్‌తో పాటు పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ “దేవర”, హృతిక్ “ఫైటర్” తర్వాత వీరిద్దరు కలిసి వార్ 2 చిత్రం చేస్తున్నారు. ఆగస్ట్‌లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.