సిర్గాపూర్, మే14 : మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థినిలు మే 16న జరిగే కౌన్సెలింగ్‌కు హజరు కావాలని ప్రిన్సిపాల్ లిక్కి శైలజ బుధవారం తెలిపారు.
ఈమేరకు టెన్త్ మార్కుల జాబితా 2024-25, టీసీ, కండక్ట్, కులం, ఆదాయ ధృవీకరణ, మూడు కలర్ పాస్ ఫొటోలు, ఆధార్, పీహెచ్సీ, ధృవీకరణ పత్రాలతో శుక్రవారం ఉదయం 11గంటలకు పీవీటీజీ కళాశాల హయత్‌నగర్‌లో కౌన్సెలింగ్‌కు హజరు కావాలని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ సిర్గాపూర్ సెల్ నెంబర్ 8333925391 కు సంప్రదించాలని సూచించారు.