IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్. ఆ జట్టు యువ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser McGurk) తదుపరి మ్యాచ్‌లకు భారత్ రావడం లేదు. ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడడంతో స్వదేశం చేరుకున్న ఫ్రేజర్.. టోర్నీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, అతడి స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman)తో ఢిల్లీ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది.
బంగ్లాదేశ్ పేసర్ అయిన ముస్తాఫిజుర్ త్వరలోనే ఢిల్లీ స్క్వాడ్‌తో కలువనున్నాడు. ఒకవేళ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కూడా ఐపీఎల్‌కు దూరమైతే.. అతడి స్థానాన్ని ముస్తాఫిజుర్ భర్తీ చేయడం ఖాయం. ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ ఆ తర్వాత అదే జోరు చూపలేక ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. అందుకు ఓపెనర్ మెక్‌గుర్క్ ఫామ్‌లేమి కూడా కొంతవరకు కారణం.
Mustafizur Rahman is back in 💙❤️ after two years!
He replaces Jake Fraser-McGurk who is unavailable for the rest of the season. pic.twitter.com/gwJ1KHyTCH
— Delhi Capitals (@DelhiCapitals) May 14, 2025
నిరుడు 17వ ఎడిషన్‌లో రెచ్చిపోయి ఆడిన ఫ్రేజర్ మెక్ గుర్క్ 18వ ఎడిషన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 6 మ్యాచుల్లో 55 పరుగులు చేశాడంతే. దాంతో, అతడిని పక్కన పెట్టిన ఢిల్లీ.. రంజీల్లో దుమ్మురేపిన కరుణ్ నాయర్‌ను తీసుకుంది. ముస్తాఫిజుర్ విషయానికొస్తే.. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ 2022, 2023 సీజన్లలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. 8 మ్యాచుల్లో 7.62 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. సీఎస్కేకు కూడా ఆడిన అనుభవం ముస్తాఫిజుర్‌కు ఉంది. ఐపీఎల్లో మొత్తంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 38 మ్యాచులు ఆడి.. 38 వికెట్లు పడగొట్టాడు.
అక్షర్ పటేల్ బృందం ప్రస్తుతం 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. మే 18న గుజరాత్ టైటాన్స్, మే 21న ముంబై ఇండియన్స్, మే 24న పంజాబ్ కింగ్స్‌తో అక్షర్ సేన తలపడనుంది. ఈ మూడింటా గెలిస్తే.. ఢిల్లీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. మే 9న పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ ఢిల్లీకి వస్తుంది. అప్పుడు 20 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. అయితే.. బలమైన గుజరాత్, ముంబైపై గెలవాలంటే ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉండడం ఢిల్లీకి చాలా ముఖ్యం.
Sunday, we resume our roars at Kotla 💙❤️ pic.twitter.com/butkhSGCgX
— Delhi Capitals (@DelhiCapitals) May 12, 2025