జనారణ్యంలోకి పెద్దపులులు.. అడవుల విస్తీర్ణం తగ్గడమే కారణం
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువులపై దాడి చేస్తున్నాయి.
- ఆహారం కోసం పశువులపై దాడులు
- ప్రాణభయంతో ప్రజలు బెంబేలు
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఫరహాబాద్ నుంచి అటవీ సఫారీ యాత్రలోని గుండం సమీపంలో మంగళవారం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది.
– అమ్రాబాద్
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువులపై దాడి చేస్తున్నాయి. ఐదు నెలల నుంచి ఇలాంటి ఘటనలు పెరుగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు పంజా విసురుతాయోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కా మారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా లో సంచరించిన ఓ పెద్దపులి ప్రస్తుతం జ గిత్యాల, ఆర్మూరు, భీమ్‌గల్ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించా రు. దాన్ని పట్టుకునేందుకు అన్ని విధా లా ప్రయత్నిస్తున్నట్టు అటవీ శాఖ ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు.
క్షీణిస్తున్న అడవులు
రాష్ట్రంలో అడవులను కాపాడాల్సిన సిబ్బంది తగినంత సంఖ్యలో లేకపోవ డం, అటవీ శాఖలో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఇందుకు ప్రధాన కార ణం. చెట్ల నరికివేత, అక్రమ మైనింగ్‌కు తోడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భా గంగా అటవీ భూముల్లో కాల్వల నిర్మాణాలు, రైల్వే ప్రాజెక్టులు, రక్షణ శాఖ కేంద్రాల ఏర్పాటుతో మానవ సంచారం బాగా పెరిగింది. దీంతో పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకల్లాంటి వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మా రింది. గతంలో పలు రాష్ట్రాల మధ్య అటవీ ప్రాంతం కలిసే ఉండేది. కానీ, ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాలతో అడవుల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయి. వాటి మధ్య ఉన్న లింకు రోడ్లు తెగిపోతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

