హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడలోని ఓ హాస్టల్ గదిలో డిగ్రీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి-కొత్తగూడెంకు చెందిన డి.ప్రవీణ్ కుమార్ (20) నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. నారాయణగూడలోని మెన్స్ హాస్టల్లో ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ గత కొన్ని రోజులుగా ఏదో తెలియని విషయంపై కలత చెందుతున్నాడని, ఎక్కువగా ఒంటరిగానే ఉన్నట్లు స్నేహితులు వెల్లడించినట్లు చెప్పారు.
బుధవారం తెల్లవారుజామున తన రూమ్ మేట్స్ లేనప్పుడు హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో నారాయణగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.