కారేపల్లి, మే 14 : ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ప్రత్యేక అధికారి నవీన్‌బాబు అన్నారు. మా ఇంటి మణిదీపంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండలం కారేపల్లి-3 అంగన్వాడీ సెంటర్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బుధవారం ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. చదువుల్లో కూడా ఆడపిల్లలే ముందంజలో ఉంటున్నట్లు వెల్లడించారు. అందుకే కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే అదృష్టంగా భావించాలన్నారు. అనంతరం సుకన్య పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, సూపర్వైజర్ రాధమ్మా, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నెహ్రూ పాల్గొన్నారు.