Urea Problems | అందోల్, ఆగస్టు 26 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో యూరియా కోసం అధికార పార్టీ నాయకులు రోడ్డు ఎక్కారు. ఇంతకాలం రైతులకే యూరియా దొరక్క రోడ్లపైకి వస్తుంటే సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ యూరియా దొరకక కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వస్తున్నారు. మంగళవారం పుల్కల్ మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ లో ఒక యూరియా బస్తాపై 50 రూపాయలు అదనంగా చెల్లించాలని ఫెర్టిలైజర్ నిర్వాహకులు తెలపడంతో ఆగ్రహించిన రైతులు షాపు ముందు రైతులు ఆందోళన చేపట్టారు.
వారితోపాటు సాక్షాత్తు కాంగ్రెస్ అధికార పార్టీకి చెందిన ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నే విఠల్ నిర్వాహకుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. 260 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను కొరత పేరుతో ఎక్కువ డబ్బులకు విక్రయించడంపై రైతన్నలు మండిపడుతున్నారు. యూరియా సంచితోపాటు అవసరం లేని మందు డబ్బాలు అంటగడుతూ ఫెర్టిలైజర్ నిర్వాహకులు రైతుల వద్ద డబ్బులు దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు యూరియా దొరకపోవడం మరోవైపు ఉన్న యూరియాను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. రైతులతోపాటు అధికార పార్టీ నాయకులకు సైతం ఈ యూరియా కొరత తలనొప్పిగా మారింది. దీంతో విసుగు చెంది వారు సైతం మంగళవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం