CITU | జహీరాబాద్, ఏప్రిల్ 28 : ప్రపంచ కార్మిక దీక్షా దినోత్సవం మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, మేడేను ఘనంగా జరపాలని.. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మహిపాల్ కార్మిక వర్గానికి సీఐటీయూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇవాళ శ్రామిక్ భవన్లో సీఐటీయూ జహీరాబాద్ ఏరియా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ మహిపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల గుండెకాయ లాంటి కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిస్థాయిలో కార్మికులను నట్టేట ముంచే, బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్‌ను తీసుకురావడాన్ని నిరసిస్తూ మే 20న దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని.. ఈ దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్మిక చట్టాలు రావడానికి కారణమైన మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మే 1న సీఐటీయూ అనుబంధ యూనియన్లు, మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణలు నిర్వహించి ఘనంగా జరపాలని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు రాజిరెడ్డి, గౌరమ్మ, నందమ్మా, నరేష్, యాల్లప్ప , నారాయణ, యశోదమ్మ, తదితరులున్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్