Migratory birds : పెరుంగులమ్ (Perungulam) రిజర్వాయర్‌కు ఈ ఏడాది భారీగా వలస పక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ప్రతి ఏడాది ఈ రిజర్వాయర్‌కు వలస పక్షులు తరలిరావడమనేది సాధారమే అయినా.. ఈసారి భారీ సంఖ్యలో రావడం విశేషం. స్థానిక పక్షులకుతోడు, విదేశాల నుంచి భారీగా వచ్చిన వలస పక్షులు పెరుంగులమ్ రిజర్వాయర్‌లో సందడి చేస్తున్నాయి. రిజర్వాయర్‌ను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులకు ఈ పక్షులు కనువిందు చేస్తున్నాయి. పెరుంగులమ్ పక్షుల సందడికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
ఈ పక్షుల సందడిపై స్థానిక పక్షి ప్రేమికుడు థామస్ మాతి బాలన్ స్పందించారు. వేసవిలో అన్ని చెరువులు, రిజర్వాయర్లు దాదాపు ఎండిపోతాయని, కానీ పెరుంగులమ్ రిజర్వాయర్ మాత్రం ఎండిపోదని చెప్పారు. పెరెన్నియల్ తమిరంబరని నది ద్వారా ఈ రిజర్వాయర్‌కు నీళ్లు వస్తాయని తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల సందర్భంగా ఈ రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరుతుందన్నారు. అందుకే వేసవి వచ్చిందంటే ఇక్కడి పెద్ద సంఖ్యలో వలస పక్షులు తరలి వస్తాయని చెప్పారు.
ప్రతి ఏడాది వేల సంఖ్యలో పక్షులు ఇక్కడ సందడి చేస్తాయని, ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువగా వచ్చాయని థామస్ తెలిపారు. తాను రిజర్వాయర్‌లో ఇంత భారీ సంఖ్యలో వలస పక్షులను చూడటం ఇదే తొలిసారని అన్నారు. ఈ రిజర్వాయర్‌లో నీటితోపాటు వక్షసంపదను, జంతుజాలాన్ని రక్షించాల్సిన బాధ్యత కేరళ ప్రభుత్వంపై ఉన్నదని, అందుకోసం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
#WATCH | Thoothukudi | Huge flock of migratory birds populate Perungulam pond
A bird enthusiast, Thomas Mathi Balan says, “In summers, all ponds dry up except this one… This Perungulam pond, formed by the perennial Thamirabarani river, receives a lot of water during the… pic.twitter.com/pT41VCjKA9
— ANI (@ANI) April 28, 2025