Mission Bhageeratha | జిన్నారం, ఏప్రిల్ 27: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పాలనలో మాత్రం మిషన్ భగీరథపై అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది.
ప్రతీ రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మిషన్ పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు బాలాజీ నగర్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి రోడ్డుపై నీరు వృథాగా పారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్య తీర్చేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వృథాగా రోడ్డుపై పారుతున్న నీరు కాలువను తలపిస్తోందని, వెంటనే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి