పెద్దపల్లి, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించటం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జెండాను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు బెదిరించినా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు10000 మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు.
ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, బెదిరించినా బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పు రాజ్ కుమార్, మొబిన్, బిక్షపతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.