బండ్లగూడ, ఏప్రిల్ 28: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై (PVNR Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో డ్రైవర్ గాయపడ్డారు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. రెండు కార్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు బోల్తా కొట్టిన కారును అక్కడి నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.