Rythu bharosa | జిన్నారం, జూన్ 19 : జిన్నారం మండలానికి రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో జిన్నారం మండల బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ఆది రామకృష్ణ యువకులతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ క్ష్రేతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు కృష్ణ, కుమార్ యాదవ్, శ్రీనివాస్, బాలేష్, నర్సింగరావు, రాహుల్, గణేష్, కుమార్, ప్రసాద్, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు