Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు
Banjarahills | వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేదిస్తున్నాం.. రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
Banjarahills | బంజారాహిల్స్, జూన్ 19: వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేదిస్తున్నాం.. రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ సర్కిల్ -18లోని పలు ప్రాంతాల్లో జలమండలితో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు జూన్ నెలలో సైతం రోడ్లను యథేచ్చగా తవ్వుతూ పనులు చేస్తున్నాయి. దీంతో ప్రధాన రోడ్లతో పాటు కాలనీ రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన రోడ్లను రిస్టోరేషన్ చేసినా వ్యర్థాలను తొలగించడంలో విపరీతమైన జాప్యం చేస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మే 25 తర్వాత కూడా రోడ్ల తవ్వకాలు కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో పనులను జీహెచ్ఎంసీ అధికారులు ఆపేసినా రోడ్ల రిస్టోరేషన్ను వేగవంతం చేయకపోవడంతో వర్షపునీటితో ప్రమాదం పొంచి ఉంది.

బంజారాహిల్స్ రోడ్ నెం 14లో శబ్దాలయ వెనకాల నుంచి జుడియో స్టోర్ దాకా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వరదనీటి లైన్ పనులు చేపట్టారు. నిర్దేశిత గడువులో రోడ్డు రిస్టొరేషన్ పనులు చేయకపోవడంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
బంజారాహిల్స్ రోడ్ నెం 13నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 1లో కొత్తగా నిర్మిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రికి సంబంధించిన అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్ కోసం జీహెచ్ఎంసీ నుంచి రోడ్డు కటింగ్ అనుమతి తీసుకుని పనులు పూర్తిచేశారు. అయితే పదిహేను రోజుల క్రితమే రిస్టోరేషన్ పనులు పూర్తయినా డెబ్రీస్ తొలగించకపోవడంతో అసలే ఇరుకైన రోడ్డు మరింత కుంచించుకుపోయి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది.
బంజారాహిల్స్ రోడ్ నెం 14 నుంచి శబ్దాలయ స్టూడియోస్, కేబీఆర్ పార్కు చౌరస్తా మీదుగా జలమండలి ఆద్వర్యంలో మంచినీటి లైన్ కోసం జూన్ 10 నుంచి రోడ్డును తవ్వేసి పనులు చేశారు. వారం రోజులు గడిచినా రోడ్డు రిస్టోరేషన్ పనులు పూర్తి చేయకపోవడంతో అత్యంత రద్దీ చౌరస్తాలో సమస్యలు తలెత్తాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ నుంచి జుడియో స్టోర్ దాకా మంచినీటి లైన్ కోసం ప్రత్యేకంగా లైన్ పనులు చేపట్టారు. అయితే వర్షాకాలంలో రోడ్డు కటింగ్ నిషేధించిన తర్వాత పనులు ప్రారంభించడంతో 10 రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు పనులు నిలిపివేయడంతో రోడ్డు మొత్తం గతుకులమయంగా మారింది. ఆగస్టు దాకా రోడ్డును తవ్వే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

