భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
భారత్ మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ తాజాగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి వేదిక కాబోతున్నది.
న్యూఢిల్లీ: భారత్ మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ తాజాగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి వేదిక కాబోతున్నది. గురువారం టూరన్(పోలండ్) వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న భువనేశ్వర్‌లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టేడియం కాంప్లెక్స్‌ను ఇద్దరు సభ్యులతో కూడిన వరల్డ్ అథ్లెటిక్స్ బృందం పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రెండేండ్ల తర్వాత జరిగే టోర్నీలో మొత్తం 26 ఈవెంట్లలో అథ్లెట్లు పోటీపడనున్నారు. పురుషులకు 13, మహిళలకు 13 విభాగాల చొప్పున కేటాయించారు. ఇందులో 60మీ, 400మీ, 800మీ, 1500మీ, 3000మీ, 60మీ హార్డిల్స్, 4X 400 రిలే, హైజంప్, పోల్‌వాల్ట్, లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్, హెప్టాథ్లాన్కు చోటు కల్పించారు. దేశంలో అథ్లెటిక్స్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది ఉదాహరణ అని జాతీయ అథ్లెటిక్స్ అసోసియేషన్(ఏఎఫ్ఐ) అధ్యక్షుడు బాహుదూర్సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే 2028 ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి కూడా భారత్ వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

