మెస్సీ @ 900.. రొనాల్డో సరసన చోటు
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి మరో రికార్డు దాసోహమైంది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న మెస్సీ తాజాగా మరో ఘనత దక్కించుకున్నాడు.
ఫోర్ట్ లాడర్డేల్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి మరో రికార్డు దాసోహమైంది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న మెస్సీ తాజాగా మరో ఘనత దక్కించుకున్నాడు. సీవోఎన్సీఏసీఏఎఫ్ చాంపియన్స్ టోర్నీలో భాగంగా నాశ్విల్లేతో జరిగిన పోరులో ఇంటర్మియామి తరఫున బరిలోకి దిగిన మెస్సీ తన కెరీర్లో 900 గోల్స్ చేశాడు. మ్యాచ్ మొదలైన ఏడో నిమిషంలోనే మెస్సీ..ప్రత్యర్థి డిఫెండర్లను ఏమారుస్తూ బంతిని చాకచక్యంగా పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ కండ్లు చెదిరే రీతిలో గోల్ కొట్టాడు. తద్వారా క్లబ్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఓవరాల్గా 900 గోల్ మార్క్ అందుకున్నాడు.
తద్వారా పోర్చుగల్ సాకర్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో సరసన రొనాల్డో నిలిచాడు. అయితే ఈ ఫీట్ అందుకునేందుకు మెస్సీ కంటే రొనాల్డోకు 94 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఇదిలా ఉంటే బ్రెజిల్ సాకర్ దిగ్గజం పిలే ఖాతాలో వెయ్యికి పైగా గోల్స్ ఉన్నట్లు అనధికారిక రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా కోట్లాది మంది ఆరాధ్య ప్లేయర్ అయిన మెస్సీ మరోమారు తన సత్తాఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన వైనంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

