NIMZ farmers | జహీరాబాద్, సెప్టెంబర్ 12 : నిమ్జ్ పరిధిలో 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ రోజు జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ భవన్ నుండి ప్రదర్శన ప్రారంభం అయి బస్టాండ్ మీదుగా గాంజ్ నుండి నిమ్జ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బయట నుంచి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి రాంచందర్ అధ్యక్షత వహించారు. అనంతరం ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రైతుల భూములు గుంజుకొంటే రైతుల పక్షాన నిలిచిన జెండా ఎర్ర జెండా అన్నారు.
చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూములు దక్కవనే బెంగతో రైతులు దిక్కు తోచని పరిస్థితిలొ ఉన్నారని.. ఎకరానికి గత ప్రభుత్వం ఇచ్చిన రూ.15 లక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం ఎంత వరకు సమంజసం అన్నారు. బహిరంగ మార్కెట్ రూ.50 లక్షల నుండి కోటి ఉంటే.. రూ.15 లక్షలు ఎట్లా ఇస్తారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం తేడా అన్నారు.
బీజేపీ రైతుల హక్కులను హరించింది..
ఈ విధంగానే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 సార్లు 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేయడానికి నిర్ణయిస్తే అడ్డుకున్నది ఎర్ర జెండా అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టంలోని చాప్టర్ 2,3 రద్దు చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆమోదించి రైతుల హక్కులను హరించింది అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంఘం జిల్లా అధ్యక్షుడు బి రాంచందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలకు పునరావాసం ఇవ్వకుండా ఏ విదంగా భూములలో చెట్ల మొక్కలు నాటుతారని అన్నారు. చట్టాలు చేసే ప్రభుత్వాలు చట్టాలనుల్లంగిస్తే ఎవరు శిక్షించాలని అన్నారు.
అనేకసార్లు అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు సమర్పించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసి చెప్పినా ఉద్దేశపూర్వకంగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 120 గజాల ప్లాటు, రైతులకు, వ్యవసాయ కూలీలకు పునరావాసం ఇచ్చేవరకు భూమిలోకి ఎట్లా వస్తారో చూస్తామని హెచ్చరించారు. సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రభుత్వం కేవలం 15 లక్షల రూపాయలు చెల్లించి రైతుల్ని ధగా చేస్తుందని.. బహిరంగ మార్కెట్లో ఎకర ధర 15 లక్షలు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ రూ.15 లక్షలు ఎకరం భూమి దొరికితే ప్రభుత్వం భూమికి భూమైన ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల్ని మోసం చేయడం కోసం మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హెచ్చరించారు.
హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతులను, కూలీలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా వేసిన నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నర్సిములు, సీఐటీయూ క్లస్టర్ కన్వీనర్. మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జహీరాబాద్ మండలం అధ్యక్షులు ఎస్. సుకుమార్,బి. నర్సిములు, పాస్తాం. తుల్జరం, ఏసేబు, నర్సింలు, యం. శంకర్, సంతోష్, గుండారెడ్డి, రాములు, గాలి రెడ్డి,బాలప్ప, గోపాల్, ఖైరత్ అల్లి, అంజమ్మ, జయమ్మ, వినోద్దా, జమిని బాయి, తదితరులు పాల్గొన్నారు.
B Venkat
Mata Vaishno Devi | ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్