Farmers Seeds | జహీరాబాద్, జూన్ 2 : జహీరాబాద్ డివిజన్ పరిధిలోని మండలాల్లో రైతులు విత్తన స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ వ్యవసాయ సహయ సంచాలకులు బిక్షపతి అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రో.జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
వానాకాలం సీజన్లో రైతులు పంటల సాగు చేసుకునేందుకు అవసరమయ్యే ఎంజీజీ-295 అనే రకం పెసర విత్తనం డివిజన్ పరిధిలోని న్యాల్కల్ మండలానికి 100 కిట్లు, ఝరాసంగం మండలానికి 80 కిట్లు, జహీరాబాద్ మండలానికి 20 కిట్లు, డబ్ల్యుర్జీ-93 అనే రకం కంది కోహీర్ మండలానికి 50 కిట్లు, ఝరాసంగం మండలానికి 50 కిట్లు, మొగుడంపల్లి మండలానికి 48 కిట్లు, జహీరాబాద్ మండలానికి 59 కిట్లు మంజూరు చేసిందన్నారు.
మూడు కిలోల చొప్పున ఉన్న కంది, పెసర విత్తనాల ఫ్యాకెట్లను ఆయా మండలాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసి వచ్చే కంది, పెసర దిగుబడిని తిరిగి ఆయా గ్రామాల్లోని రైతులకు విత్తన రూపంలో అందజేయం జరుగుతుందన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి