Narsapur | నర్సాపూర్, ఆగస్ట్ 28: మెదక్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ధాటికి పలు ప్రధాన మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి.
నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ బుంగ పడిన రోడ్డును పరిశీలించారు. ఇక కుండపోత వర్షాలు, వరదల ధాటికి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ గౌడ్ సంబంధించిన వరి పంట నీట మునిగింది.
లింగాపూర్ గ్రామ శివారులో నాగలి చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో లింగాపూర్ గ్రామంలో వరద నీటి ప్రవాహ ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడ తాండాలో గల శెట్టి కుంటకు వరద పోటెత్తి గండి పడింది.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త