Urea | చేగుంట, ఆగస్టు 24 : పంటలకు సకాలంలో ఎరువులు అందివ్వాలన్న రైతన్న ఆశలు అడియాసలే అవుతున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలంలో గత కొన్ని రోజులుగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత రెండు వారాలుగా యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నేఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రాథమిక పరపతి సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడ్డ ఎరువులు దొరకడం లేదు. ఒక ఎరువుల కేంద్రానికి 200 నుంచి 250 బస్తాలు వస్తే ఆరు, ఏడు వందల మంది వేచి చూసినా ఫలితం లేదు. ఆధార్, పట్టా పాస్ బుక్కు యూరియా సంచి ఇస్తున్నారు.
యూరియా కోసం ఐదు నుంచి ఆరు వందల మంది రైతులు వస్తే 200 మంది రైతులకు కూడా యూరియా బస్తాలు దొరకడం లేదు. ఎరువులు దుకాణాల వద్ద పోలీసుల పహారాలో ఎరువుల బస్తాలను పంపిణీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు కావలసిన యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Rat | నీళ్ల బిందెలో ఎలుక.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?