Rat | శివ్వంపేట, ఆగస్టు 23 : అంగన్వాడీ కేంద్రంలో నీళ్ల బిందెలో ఎలుక పడింది. ఆ బిందెలోని మంచి నీరు తాగిన చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. రత్నాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి శనివారం 10 మంది చిన్నారులు హాజరయ్యారు.
అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమణి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తూ చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. అయితే భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను విద్యార్థులు తాగారు. అక్కడికి వచ్చిన ఒక చిన్నారి తల్లి తన బిడ్డ నీళ్ల కోసం ఏడుస్తుందని నీళ్లు తెద్దామని బిందె వద్దకు వెళ్లి చూసింది. అందులో ఎలుక చనిపోయి ఉండడాన్ని గమనించి, ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్‌కు తెలియజేసింది.
అయితే అప్పటికే చిన్నారులు ఎలుక పడ్డ నీళ్లు తాగేశారు. ఈ విషయం బయటకు రావడంతో హుటాహుటిన అంగన్ వాడీ కేంద్రానికి చేరుకున్న చిన్నారుల తల్లిదండ్రులు విద్యార్థులను ఆటోలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అంగన్వాడీ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మూడు రోజుల కిందట బిందెలో పట్టిన నల్ల నీళ్లలో ఎలుక పడిందని, బిందెకు మూత లేకపోవడం అంగన్వాడీ టీచర్ కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తాము చూడకపోతే తమ పిల్లల గతి ఏమైతుండేనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నారులకు ఎలాంటి అపాయం లేదు..
రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలోని నీళ్ల బిందెలో ఎలుక పడిన నీళ్లు తాగిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్టు సీడీపీఓ హేమభార్గవి పేర్కొన్నారు. చిన్నారులకు వైద్య పరీక్షల అనంతరం ఇంటికి పంపించడం జరిగింది. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడి టీచర్, హెల్పర్ లకు మెమోలు జారీ చేసినట్టు ఆమె వెల్లడించారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో