IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఢిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది.
భువనేశ్వర్: అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఢిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది. వివిధ పొరలతో కూడిన వాయు రక్షణ వ్యవస్థ ఐసీడీడబ్ల్యూఎస్.. ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థ క్షిపణులు, అధిక శక్తిగల లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్ఎస్డీఓ, సాయుధ దళాలను ఎక్స్ వేదికగా అభినందించారు.
ఐఏడీడబ్ల్యూఎస్ను ఆగస్టు 23న 12.30 గంటల సమయంలో ఒడిశా తీరం నుంచి డీఆర్డీఓ విజయంతంగా పరీక్షించిందని చెప్పారు. ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అని, ఇందులో భారత్ అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (QRSAM), అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిసైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (DEW) ఉన్నాయన్నారు. ఐఏడీడబ్ల్యూఎస్ను విజయవంతంగా అభివృద్ధి చేసిన డీఆర్డీఓ, సైనిక దళాలను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ ప్రత్యేకమైన పరీక్ష బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసిందన్నారు. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుందని వెల్లడించారు.
Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.
IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),… pic.twitter.com/Jp3v1vEtJp
— DRDO (@DRDO_India) August 24, 2025
The @DRDO_India has successfully conducted the maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS), on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.
IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air… pic.twitter.com/TCfTJ4SfSS
— Rajnath Singh (@rajnathsingh) August 24, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

