శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jul 09, 2020 , 00:54:53

పనుల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలి

పనుల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలి

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : అభివృద్ధి పనుల వివరాలను వెనువెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి బుధవారం మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు, మున్సిపల్‌ పరిధిలో పని చేస్తున్న స్వచ్ఛ ఆటోలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అదనంగా కావాల్సిన సిబ్బంది వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. 2011-2015 జనాభా లెక్కల ప్రకారం 500 నివాసాలకు ఒక్క స్వచ్ఛ ఆటో ఏర్పాటు చేయాలన్నారు. వాటి కొనుగోలు నిర్వాహణ ఖర్చులు,  ఇతర వివరాలను పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి అందించాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ వివరాలు, ఇంకా అవసరం ఉన్న చోట గుర్తించాలన్నారు. టెండర్లు పూర్తి చేసి ఆగస్టు 15 లోగా  ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్‌, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట, నస్పూర్‌ మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ విభాగం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo