
(Niranjan Reddy) వనపర్తి: ఏసుక్రీస్తు బోధనలు మన నిత్య జీవితంలో పాటించడం ద్వారా పరమత సహనం అలవర్చుకోవచ్చునని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వనపర్తి చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి నిరంజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసు కోసి తినిపించారు. అక్కడ చేరిన వారిని ఆప్యాయంగా పలుకరించారు. చర్చి పెద్దలను పేరుపేరునా పలుకరిస్తూ వారి ఆశీస్సులు అందుకున్నారు.
దేవుడిని ప్రేమించే అన్ని మతాల వారికి క్రిస్మస్ శుభకాంక్షలు తెలిపారు. పరమత సమానం చూపించాలన్నారు. ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చెప్పారు. ద్వేషానికి విరుగుడు సహనంగా ఉండటమే అన్నారు. ఏ మతం బోధించేదైనా భగవంతుడు ఒక్కడే అని, విశ్వాసాలు, నమ్మకాలు వేరు అని పేర్కొన్నారు. లోక కల్యాణం కోసమే ఆయన శిలువెక్కాడని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..