కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
Eye Lashes: ముఖానికి కళ్లు ఎంతో అందాన్నిస్తాయి. అయితే, ఆ కళ్లకు వన్నె తెచ్చేవి కనురెప్పలు. అందుకే కనురెప్పలు అందంగా కనిపించడం కోసం మగువలు ఐలాష్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో

హైదరాబాద్: ముఖానికి కళ్లు ఎంతో అందాన్నిస్తాయి. అయితే, ఆ కళ్లకు వన్నె తెచ్చేవి కనురెప్పలు. అందుకే కనురెప్పలు అందంగా కనిపించడం కోసం మగువలు ఐలాష్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో అయితే కృత్రిమ కనురెప్పలను కూడా వినియోగిస్తున్నారు. వాస్తవానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా కృత్రిమ కనురెప్పల జోలికి వెళ్లకుండానే మీ కనురెప్పలను ఒత్తుగా, అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. అందుకు మన వంటింట్లో ఉండే పదార్థాలే చాలు. మరి ఆ చిట్కాలేమిటో..? అందుకు ఉపయోగపడే వంటింటి పదార్థేమిటో తెలుసుకుందామా..?
మొదటి చిట్కా: ఆముదానికి కనురెప్పలను అందంగా తీర్చిదిద్దే గుణాలున్నాయి. శుభ్రమైన బ్రష్ లేదా దూదిని ఆముదంలో ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకు రాసుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలలపాటు పాటిస్తే ఒత్తయిన కనురెప్పలు మీ సొంతం. అయితే కొందరికి ఆముదం అలర్జీ ఉంటుంది. దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చిట్కాను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
రెండో చిట్కా: కోడిగుడ్డులో కనురెప్పలు ఒత్తుగా పొడవుగా పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుడ్డులోని బయోటిన్, విటమిన్ బి కూడా కనురెప్పల పెరుగుదలకు, అవి నల్లగా ఉండేందుకు తోడ్పడతాయి. ఓ గిన్నెలో గుడ్డును కొట్టిపోసి, దానికి టేబుల్ స్పూన్ గ్లిజరిన్‌ను కలుపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దూది ఉండను ఈ మిశ్రమంలో ముంచి కనురెప్పల వెంట్రుకలకు రాసుకొని 15 నిమిషాలపాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో కడగాలి. వారంలో మూడు రోజులపాటు ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
మూడో చిట్కా: గ్రీన్ టీలో ఉన్న ఫ్లవనాయిడ్స్ కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరుగడానికి దోహదపడుతాయి. వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగును ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత టీ బ్యాగ్‌ను తీసేసి నీటిలో దూది ఉండను ముంచి బాగా పిండాలి. తర్వాత ఆ దూదితో కనురెప్పల మొదళ్ల నుంచి చివరిదాకా రాయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను రోజుకు రెండు సార్లు చొప్పున వరుసగా మూడు నెలలపాటు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కానీ, ఈ చిట్కాను పాటించేటప్పుడు గ్రీన్ టీ కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
నాలుగో చిట్కా: కొబ్బరిపాలలో దూదిని ముంచి కనురెప్పలకు రాసుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొబ్బరిపాలలో ఉండే కొవ్వులు కనురెప్పలను ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. రోజూ కాసేపు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే కూడా కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. నూనెలోని సహజ కొవ్వులు, ప్రొటీన్లు, లారిక్ ఆమ్లం, విటమిన్ ఇ, ఐరన్ వంటివి అందుకు తోడ్పడుతాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

