రామాయంపేట, జూన్ 6: మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. శివ్వంపేట పోలీస్ స్టేషన్లో విధులు పూర్తి చేసుకుని తన సొంత గ్రామం కోమటిపల్లికి వెళ్తుండగా రామాయంపేట శివారులో లారీ ఢీకొనడంతో కానిస్టేబుల్ మహిపాల్ (35) అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.