Vitamin C: మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
Vitamin C: విటమిన్-సీ.. శరీరానికి అవసరమైన పోషకం. ఇది తెల్ల రక్త కణాలను పెంచడం ద్వారా మనలో రోగనిరోధక శక్తిని బలపడేలా చేస్తుంది. ఇది శరీరం స్వయంగా...

(Vitamin C) విటమిన్-సీ.. శరీరానికి అవసరమైన పోషకం. ఇది తెల్ల రక్త కణాలను పెంచడం ద్వారా మనలో రోగనిరోధక శక్తిని బలపడేలా చేస్తుంది. ఇది శరీరం స్వయంగా తయారు చేసుకోని యాంటీ ఆక్సిడెంట్. అందువల్ల సహజసిద్ధమైన ఆహారాల నుంచి గ్రహించాలి. ఈ విటమిన్ లోపం వల్ల గుండెకు సంబంధించిన నరాలు, ఎముకలు, చర్మం దెబ్బతింటాయి. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ సీ, సప్లిమెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
విటమిన్ సీ అనేది నీటిలో కరిగిపోయే పోషకం. అందుకని నిత్యం తగిన మోతాదులో శరీరానికి అందేలా తినాలి. ప్రొటీన్లను సంరక్షించడంలో విటమిన్ సీ సహాయపడుతుంది. మగవారు 90 మిల్లీగ్రాములు, ఆడవారు 75 మిల్లీగ్రాములు నిత్యం శరీరానికి అందించాలి. పెద్దల్లో పిగ్మెంటేషన్, ఇతర చర్మ సంబంధ వ్యాధులు వచ్చిన సమయాల్లో 1000 మిల్లీ గ్రాముల వరకు విటమిన్ సీ తీసుకోవాలి. గర్భంతో ఉన్నవారు నిత్యం 85 మిల్లీగ్రాములు, బాలింతలు 120 మిల్లీగ్రాముల వరకు శరీరానికి అందేలా చూడాలి.

ఏం చేస్తుంది..?
అధిక రక్తపోటు రాకుండా చూస్తుంది.
అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
డీఎన్ఏ రిపేరింగ్, దెబ్బలు మానడంలో సహాయపడుతుంది.
తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టీబీ నుంచి మనల్ని కాపాడుతుంది.
ఈ విటమిన్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
ఎలా పొందాలి..?
విటమిన్ సీ ముఖ్యంగా నిమ్మజాతి పండ్ల నుంచి పొందవచ్చు. ఆరెంజ్, నిమ్మ, కివి, పైనాపిల్, చెర్రీ, బ్లూబెర్రీ, బొప్పాయి, టమాట, బ్రొకోలి నుంచి ఎక్కువ మొత్తంలో సీ విటమిన్ లభిస్తుంది. ఇవేకాకుండా పాలు, జామ, దుంపలు, క్యాబేజీ, ఉసిరి, టర్నిప్, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, క్యాప్సికమ్‌లో కూడా లభిస్తుంది.
లోపిస్తే ఏంటి..?
విటమిన్ సీ లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీ విటమిన్ లోపిస్తే.. చర్మం పొడిబారడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో రక్తం లేకపోవడం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం, రోగనిరోధక శక్తి తగ్గడం, కీళ్ల నొప్పులు, దంతాల బలహీనత లక్షణాలు కనిపిస్తాయి.
మరి ఎక్కువైతే..?
శరీరానికి నిత్యం ఎంత మోతాదులో సీ విటమిన్ అవసరమో అంతే అందించేలా చూసుకోవాలి. ఎక్కువ మొత్తంలో అందితే ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఎక్కువ మొత్తంలో ఐరన్ పెరిగేలా చేస్తుంది. వీటితోపాటు కడుపు నొప్పి, వికారం, వాంతులు, గుండెల్లో మంట, తలనొప్పి, నిద్రలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

