న్యూ చండీఘడ్: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు(IND vs AFG) మ్యాచ్‌లో తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 96 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 37, సాయి సుదర్శన్ 32 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ అజేయంగా రెండో వికెట్‌కు 55 రన్స్ జోడించారు. తొలుత టాస్ గెలిచిన ఇండియా .. బ్యాటింగ్ ఎంచుకున్నది. కొత్త బంతి చాలా స్వింగ్ అయ్యింది. కానీ ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ .. ఆఫ్ఘన్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తు కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ బంతి అతని బ్యాట్‌కు తగిలి క్యాచ్ వెళ్లింది. కానీ డీఆర్ఎస్కు వెళ్లకపోవడం వల్ల రాహుల్‌కు కలిసి వచ్చింది. తొలి వికెట్‌కు రాహుల్, జైస్వాల్ 41 రన్స్ జోడించారు. 24 రన్స్ చేసిన జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రాహుల్ 37, సాయి సుదర్శన్ 32 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా తరపున మానవ్ సుతార్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.