ధన్వాడ, జూన్ 6 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని చర్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకున్నది. ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చర్లపల్లికి చెందిన రైతు కరుణాకర్‌రెడ్డి(41) శుక్రవారం వ్యవసాయ పొలానికి వెళ్లి మోటర్‌కు సంబంధించిన విద్యుత్ కేబుల్‌ను సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య వనజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. కరుణాకర్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Maoists | పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలి : ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
Bachupally | బాచుపల్లి మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ.. నేపాల్ నుంచి తీసుకొచ్చి మర్డర్!
Part 2 | పార్ట్ 2కి వచ్చే సరికి కాస్టింగ్ మొత్తం మారింది.. ఏం జరుగుతుంది..!