Part 2 | సీక్వెల్స్ అంటే దాదాపుగా తొలి పార్ట్‌లో ఉన్న ఆర్టిస్ట్‌లనే కంటిన్యూ చేస్తారు. ప్రధాన పాత్రధారులని మార్చి సీక్వెల్స్ చేయడం చాలా అరుదు. కాని ఇప్పుడు కాక్టెయిల్2 కోసం కాస్టింగ్ అంతా మార్చేస్తున్నారనే టాక్ నడుస్తుంది. ‘కాక్టెయిల్’ చిత్రం 2012లో విడుదలైంది. ఈ చిత్రం హోమి అడాజానియా దర్శకత్వంలో రూపొందగా, ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందింది. ఈ మూవీ కమర్షియల్‌గా విజయవంతం కావడమే కాకుండా విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.
బ్లాక్ బస్టర్ ‘కాక్ టెయిల్’ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా వస్తోంది అంటే యూత్‌లో జోష్ వస్తుంది. పార్ట్ 1 విజయం సాధించిన తర్వాత హోమి అడాజానియా కాక్టెయిల్ 2 చిత్రంని రూపొందించడానికి రెడీ అయ్యాడు. అయితే రెండో పార్ట్‌లో తారాగణం అంతా మారబోతుందనే టాక్ నడుస్తుంది. ‘కాక్టెయిల్ 2’ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు కాని, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. షాహిద్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. కృతి సనన్ మరియు రష్మిక మందన్నా కూడా ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఈ రొమాంటిక్ కామెడీ 2025 ఆగస్టులో సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది చివరి నాటికి థియేటర్స్‌లో తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారట. భారతదేశం సహా యూరప్‌లోని కొన్ని సుందరమైన లొకేషన్లలో మూవీ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది. షాహిద్ ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ తదుపరి చిత్రంలో నటిస్తుండగా, ఈ మూవీకి అర్జున్ ఉస్తారా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక కృతి విషయానికొస్తే ధనుష్ సరసన ఆనంద్ ఎల్ రాయ్ `తేరే ఇష్క్ మే` చిత్రంలో నటించింది. మరోవైపు రష్మిక, కాక్టెయిల్ 2 లో నటించే ముందు ఆయుష్మాన్ ఖురానాతో `థమా` షూటింగ్ పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.