టేకులపల్లి, ఫిబ్రవరి 28 : ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్పీఎస్టీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని శనివారం కొత్తగూడెంలోని ఆనంద ఖని జడ్పీహెచ్ఎస్ లో జరిగిన జిల్లా సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్ జిల్లా అధ్యక్షుడిగా ఎం.మోహన్ రావు (టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ), ప్రధాన కార్యదర్శిగా ఏ.శంకర్రావు (జడ్పీహెచ్ఎస్,నెల్లిపాక బంజర), గౌరవ అధ్యక్షుడిగా ఎన్.రాజశేఖర్ (ఏఎంఓ), గౌరవ కార్యదర్శిగా ఎస్కే.సైదులు (సీఎంఓ), కోశాధికారిగా ఎస్.యశోద (పాల్వంచ), మహిళా ప్రతినిధిగా జి.అనురాధ (కొత్తగూడెం), ఉపాధ్యక్షులుగా ప్రభు సింగ్ (ఇల్లెందు), జె.లక్ష్మి(రుద్రంపూర్), బి.బాసు (భద్రాచలం), సహాయ కార్యదర్శులుగా బి.బిచ్చ (ములకలపల్లి ), ఉమాదేవి (బూర్గంపాడు), డి.రామిరెడ్డి (పినపాక ), టెక్నికల్ కార్యదర్శులుగా టి.పాపారావు (పాల్వంచ), సీహెచ్.శ్రీనివాస్ (భద్రాచలం), డివిజనల్ ఇన్చార్జులుగా కె.నాగేశ్వరరావు (మణుగూరు), డి ఏ రామకృష్ణ (భద్రాచలం), పి.దుర్గా శైలజ (పాల్వంచ), ఎం.ఎం.భాస్కరాచారి (దమ్మపేట ), బి.దేవిలాల్ (కొత్తగూడెం), ఎస్.శాంతకుమారి (జూలూరుపాడు), ఎం.రఘు (ఇల్లెందు) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ సంపత్ కుమార్, వివిధ మండలాలకు చెందిన ఫిజికల్ సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.