‘కేజీఎఫ్’ ఫేం యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’. ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మరో కొత్త పోస్టర్ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తున్న యశ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
యశ్ చేతులు చిక్కటి రక్తంతో తడిసి ఉండటం, వేళ్ల నుంచి రక్తపు చక్కలు జారుతూ కనిపించడం చూస్తే, ఇదొక టెర్రిఫిక్ యాక్షన్ సీన్‌కి సంబంధించిన స్టిల్ అని అర్థమవుతున్నది. ఫియర్, మిస్టరీ, ైస్టెల్ మేళవింపైన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుందని మేకర్స్ చెబుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.