నీటిలో మునిగి ముగ్గురు మృతి.. ఒకరు గల్లంతు.. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ఘటన
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్ ఖలీం (24), నజువత్ (24), అజీమ్ (24), మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్‌నగర్‌కు చెందిన ఆర్హాన్ (17) విహారయాత్ర కోసం ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్లారు.
- చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేత
ఏర్గట్ల, జూలై 26 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్ ఖలీం (24), నజువత్ (24), అజీమ్ (24), మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్‌నగర్‌కు చెందిన ఆర్హాన్ (17) విహారయాత్ర కోసం ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. షేక్ ఖలీం, నజువత్, ఆర్హాన్ మృతదేహాలు లభించాయి. మరో యువకుడు అజీమ్ ఆచూకీ కోసం గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్టు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కృష్ణానదిలో జాలరి గల్లంతు
కొల్లాపూర్, జూలై 26 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడేనికి చెందిన కాట్రాజ్ బాలయ్య (45) శనివారం మధ్యాహ్నం కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. కాట్రాజ్ బాలరాజు, నర్సమ్మ దంపతులు చేపల వేటకు వెళ్లారు. పుట్టిలో కృష్ణానదిలోని కొత్తిగుండు వరకు చేరుకున్న తర్వాత వలను వదులుతున్న సమయంలో బాలయ్య ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్ని మాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో వెతికినా ఆచూకీ లభించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

