Jagadish Reddy | రేవంత్ మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి పంపిస్తున్నడు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | విద్యుత్ రాకపోవడానికి కారణం రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. దాంట్లో భాగంగా స్థానికంగా కూడా ఒక సమస్య ఉంది. ఈ ప్లాంటు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.
Jagadish Reddy | బొగ్గు విషయంలో ఎందుకు సమస్య వచ్చిందంటే.. రేవంత్ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తన గురువుకు పంపిస్తున్నడు. ఇంకోవైపు కర్ణాటకలో వాళ్ల పార్టీ ప్రభుత్వముంది. అక్కడికి పంపిస్తున్నడు.. తెలంగాణ ప్రజలను దారుణంగా శిక్షిస్తున్నడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం గురువారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లింది.
అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో తయారైన బ్రహ్మాండంగా తయారైన మంచి బొగ్గు గురించి అధికారులకు చూపించిన లెక్కలున్నాయి. రేవంత్ రెడ్డి వాటిని ఏపీకి పంపుతున్నడు.. కర్ణాటకకు పంపుతున్నడు. తెలంగాణకు మాత్రం ఎడమ చేయి చూపించి నాశనం చేసిండు. దీనివల్లనే ఇబ్బంది అయింది తప్ప వేరే ఏమీ లేదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.. విద్యుత్ రాకపోవడానికి కారణం రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. దాంట్లో భాగంగా స్థానికంగా కూడా ఒక సమస్య ఉంది. ఈ ప్లాంటు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.
ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే తప్ప అధికారులు కాదు.. సిబ్బంది కాదు.. బొగ్గు లేక కాదు.. నీళ్లు లేక కాదు.. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనే శని మాత్రమే తెలంగాణను పట్టి నాశనం చేసి నీళ్లు లేకుండా చేస్తుంది.. కరెంట్ లేకుండా తెలంగాణను చీకట్లోకి నెడుతుందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నాడు
దీని వల్లే ఇబ్బంది అయింది తప్ప వేరే ఎలాంటి కారణం లేదు
ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే
పూర్తి… https://t.co/SMcHgCkqvm pic.twitter.com/Yn2FCm1wzB
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్ళిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం pic.twitter.com/mFMVbxpRNd
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్లో రణ్బీర్ కపూర్!
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

