Muthoot Fincorp : ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (Muthoot Fincorp LTD) పంట పండనుంది. బంగారంపై రుణాలతో అందరికీ చేరువైన ఈ సంస్థ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో దోస్తీకి సిద్ధమైంది. పలు సంస్థలను వెనక్కి నెట్టి భారత జట్టు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకుందీ సంస్థ. వచ్చే రెండేళ్ల పాటు టీమిండియా జెర్సీలపై ముత్తూట్ పేరు తళుక్కుమననుంది. ‘బ్లూ ముత్తూట్’ (Blue Muthoot) పేరుతో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందీ కంపెనీ. అయితే.. స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కానుందని సమాచారం.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లో భారత జట్టు టైటిల్ స్పాన్సర్‌గా కంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీలు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన ముత్తూట్ ఫిన్‌కార్ప్ కూడా చేరనుంది. రెండేళ్ల కాలానికి బీసీసీఐతో ముత్తూట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. 2028 మార్చి 31 వరకూ ఈ హోదాలో కొనసాగనుందీ కొచ్చికి చెందిన ఫైనాన్స్ కంపెనీ. అయితే.. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
🚨 REPORTS 🚨
Muthoot Fincorp set to become the BCCI’s title sponsor for the next two years, starting with the West Indies ODI series. 🇮🇳
(Source: TOI)#Cricket #India #BCCI pic.twitter.com/jO9HkFxanC
— Sportskeeda (@Sportskeeda) September 24, 2026
సొంతగడ్డపై త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌తో టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ప్రయాణం మొదలవ్వనుంది. అక్టోబర్ 16 నుంచి విండీస్‌తో వన్డే సిరీస్ నుంచి బ్లూ ముత్తూట్ పేరుతో ఈ కంపెనీ పేరు మరింత మందికి చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులకు ముత్తూట్ ఫైనాన్స్ భారీగానే ఖర్చు చేయనుందని టాక్.
టీమిండియా ఒక్కో మ్యాచ్‌కు కనీస ధర రూ.4.85 కోట్లు కాగా.. బేరసారాల అనంతరం ఈ మొత్తం కాసింత తగ్గే అవకాశముంది. టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ పేరును బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది. ఈ రెండేళ్లలో.. టీమిండియా స్వదేశంలో 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఉన్నాయి.
🚨 MUTHOOT FINANCE BECOMES THE NEW TITLE SPONSOR OF INDIAN CRICKET! 🇮🇳🏏
Muthoot Finance bags the BCCI’s title sponsorship rights for Indian cricket until 2028. 🔥
A new chapter begins for Indian cricket’s commercial journey! 💙#MuthootFinance #BCCI #TeamIndia #IndianCricket pic.twitter.com/gfNwBRMxbT
— SportsTiger (@The_SportsTiger) September 24, 2026