హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు అందుబాటులో లేకుండా పోయాడు. ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు అందజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన పేరొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు.
ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్టు స్పష్టమవుతుండటంతో ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు గత రెండ్రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.