తిమ్మాజిపేట, ఏప్రిల్ 11 : తిమ్మాజీపేట మండలం అమ్మపల్లి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, స్వామి ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చేసుకునేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Posani Krishna Murali | ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
KCR | వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే: కేసీఆర్
Ajith | సినిమా విడుదలైన 8 గంటల్లోనే అజిత్ మూవీ హెచ్ డీ ప్రింట్ లీక్..షాక్‌కి గురైన నిర్మాతలు