హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని చెప్పారు. సబ్బండ కులాల అభ్యున్నతి కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫూలే ఆశయాలను అమలు చేసిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే సామాజిక ప్రగతి సాధ్యమని వెల్లడించారు.
సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, పంట కొనుగోలు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని చెప్పారు. పేదల్లో కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక భరోసా పెంచిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణతో దేశ ప్రగతిలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కీలక భూమిక పోషించిందని వెల్లడించారు. ఫూలే స్ఫూర్తితో తొలి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని సూచించారు.